బొబ్బిలిలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్

  • ముత్తావలస గ్రామంలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్

బొబ్బిలి, ప్రత్యేక ఓటర్ జాబితా శిబరంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం ముత్తావలస గ్రామంలో బి.ఎల్.ఓ తో కలిసి జనసైనికులు ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొని ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు దాటిన వారికి జనసైనికులకి పార్టీ పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ కొత్తగా కొంతమందికి ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, జనసైనికులు నరేంద్ర, బొద్దల గణేష్, అప్పారావు, సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

బొబ్బిలి మున్సిపాలిటీ, ప్రత్యేక ఓటర్ జాబితా శిబరంలో భాగంగా బొబ్బిలి మున్సిపాలిటీలో 1వ వార్డ్ లో 50, 51 బూత్ లో బి.ఎల్.ఓ తో కలిసి ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొని ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. అలాగే 22 కొత్త ఓట్లు రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ బి.ఎల్.ఓ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లెం రాజా తదితరులు పాల్గొన్నారు.