విజయవాడ – హైదరాబాద్‌ హైవే పైకి వరద నీరు

భారీ వర్షాలకు విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో ముందుకు కదిలే పరిస్థితి కనిపించకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో రాత్రి మొత్తం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరద నీటిని తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పోలీసులు, R@B అధికారులు తెలిపారు.