వినాయక చవితి మహోత్సవాల అంకురార్పణ

*ఎమ్మెల్యే గిడ్డి చేతుల మీదుగా పందిరి రాట ముహూర్తం, ఉత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ, ఉచిత మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయ ఆవరణంలో వినాయక చవితి మహోత్సవములు-2025 సందర్భముగా, గురువారం ఉదయం 7:56 గంటలకు ఉత్సవ అంకురార్పణ (పందిరి రాట ముహూర్తం) గౌరవ శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవ ఆహ్వాన పత్రికను శాసన సభ్యులు ఆవిష్కరించారు. అదేవిధంగా, భక్తుల కొరకు ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది. నేటి నుంచి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు అందజేయబడతాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు, భక్తులు, మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-07-at-9.30.53-AM-1024x556 వినాయక చవితి మహోత్సవాల అంకురార్పణ
WhatsApp-Image-2025-08-07-at-9.30.54-AM-1024x576 వినాయక చవితి మహోత్సవాల అంకురార్పణ

Share this content:

Post Comment