వాకలపూడిలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: రూరల్ మండలం, వాకలపూడి గ్రామం హార్బర్ పేట ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా స్థానిక జనసేన నాయకులు పాలేపు ఈశ్వర్ ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు తెలుగుదేశం నాయకులు రాందేవు సీతయ్య దొర.. ఈ సందర్బంగా పర్యటన చేస్తున్న నాయకులకు ఈ గ్రామంలో ప్రైమరి హెల్త్ సెంటర్ లేదని, ఎవరికైన ప్రమాదం జరిగిన చికిత్సకి కాకినాడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకువెళ్లాలని పి.హెచ్.సి ఏర్పాటు చేయాలని, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని వేట సామాగ్రి పోతున్నాయని, రోడ్లు లేవని, వీధి లైట్లు లేవని, డ్రైనేజీలు లేవని, పారిశుధ్యం లేదని, ఇలా అనేక సమస్యలను తెలిపారు. కొద్దిరోజుల వ్యవదిలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని సామాన్య ప్రజలు మెచ్చే పరిపాలన అందిస్తామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాలేపు కృష్ణ, జనసేన నాయకులు గంట ప్రసాద్, శివాజీ, ధనుష్, శివ చిన్నారావు, ఒలేటి శ్రీను, స్థానిక, జనసేన యువత మరియు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.