దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నాం: కిషన్ రెడ్డి

దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత దేశ చరిత్రను భావి తరాలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చరిత్ర మొత్తాన్ని ఢిల్లీ పురావస్తు శాఖ కేంద్రంలో పొందుపరిచారని తెలిపారు. 18 కోట్ల పేజీల డాక్యుమెంట్లు, 55 లక్షల ఫైళ్లు, 64 వేల అధ్యాయాలు, లక్ష 2 వేల మ్యాపులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో కొత్త నిర్మాణాలు వచ్చినా, చారిత్రక సంపదను కాపాడుకుందామని అన్నారు. పర్యాటక ప్రదేశాల వద్ద జనం గుమికూడొద్దని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను జయించగలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.