పన్నులతో పీడిస్తున్న జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలోజిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, దారపు సతీష్, షమీర్ ఆధ్వర్యంలో 33 వార్డ్ లచ్చిరాజు వారి వీధి ప్రాంతంలో పన్నులతో పీడిస్తున్న ఈ జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్ను వేయడానికి సిద్ధం, కరెంటు బిల్లుల చార్జీలను 9వ సారి పెంచడానికి సిద్ధం, వాహనాలమీద కళ్ళుపచ్చబడే రీతిలో పన్ను వేయడానికి సిద్ధం అని అంటూ రకరకాలుగా ప్రజల రక్తాన్ని పీలిచిపిప్పిచేసేందుకు మల్లీ ముందుకు వస్తున్నాడనీ జీవితాలు దుర్లభం చెసేసాడనీ, కాకినాడని విధ్వంశం చేయడానికి సిద్ధం అనీ అందుకే ఈ విధ్వంశాలన్నిటికీ చరమగీతం పాడటానికి మేము ప్రజలతో సిద్ధం అని అంటున్నామన్నారు. రానున్నరోజులలో జనసేన తెలుగుదేశంల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాకా ఈపనికిమాలిన చెత్తపన్నులని తీసి సరళీక్రుతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అందుకు మేము సిద్ధం అని నినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, సుంకర సురేష్, బడగంటి సురేష్, పెద్దిరెడ్డి భాస్కర్, బస్వాది నాగబాబు, పాలిక శివ, పెద్దిరెడ్డి రాజేష్, దారపు శిరీష, బోడపాటి మరియా బటులీల, సుజాత, హైమావతి, సోని ఫ్లోరెన్స్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.