కౌలు రైతు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జీవన్ కుమార్

అనంతపురంజిల్లా, గుంతకల్లు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అరికేరి జీవన్ కుమార్.. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొండాపురం గుత్తి గ్రామాలలో గల బాధిత కుటుంబాలను కలిసి వారిని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకువెళ్లి, ఆర్థిక సహాయం అందించి, వారిని తిరిగి క్షేమంగా వారి గ్రామాలకు చేర్పించారు. ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ.. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన్నీలా గ్రామంలో కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము కౌలు రైతు కుటుంబాలకు అన్ని వేళల అండగా ఉంటామని, వారి పిల్లల భవిష్యత్తు కూడా జనసేన చూసుకుంటుందని జీవన్ కుమార్ తెలియజేశారు.