స్థాయి మరిచి మాట్లాడితే సహించం!

*ఇజ్రాయల్‌కు ఎమ్మెల్యే గిడ్డి వార్నింగ్!

పి.గన్నవరం, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ కు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫోన్‌లో గట్టి హెచ్చరిక జారీ చేశారు. “స్థాయికి మించి మాట్లాడుతున్నావ్, నీకు తగదు,” అంటూ ఫోన్‌లో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రశంసించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తుచేశారు. “రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్‌ను విమర్శించడం తగదని స్పష్టం చేశారు. “నీతి, నిజాయితీ గల నాయకుడిపై నువ్వు గాని, నీ పార్టీ నాయకులు గాని మళ్లీ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు,” అంటూ స్పష్టం చేశారు.

Share this content:

Post Comment