రాష్ట్ర అభివృద్ధికై కలిసి పనిచేస్తాం

  • జనసేన, టిడిపిల ఆత్మీయ సమావేశం

చంద్రగిరి: తిరుపతి జిల్లా పాకాల మండలం, దామల్ చెరువు గ్రామంలో ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం ఇన్చార్జి టిడిపి పులివర్తి నాని సతీమణిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. దామలచెరువు గ్రామంలో ఉన్న జనసైనికులతో కలిసి టిడిపి జనసేన కలిసి పనిచేయాలని మరియు జగన్ అనే సైకోలు వచ్చే ఎన్నికల్లో జైలుకు పంపాలని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ఇరువురు పార్టీలు పని చేయాలని సమావేశంలో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాపు సంక్షేమ సేన రైతు విభాగం అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు రమేష్ బాబు మారసాని, శివ కృష్ణ గుర్రంకొండ, నాగేంద్ర మారసాని, నాగిరెడ్డి మారసాని, నాసిర్ జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ ఇంకా జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.