`వెల్‌డన్ అల్లు అర్జున్: వార్నర్

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు తెలుగు సినిమాలన్నా, తెలుగు సినిమా పాటలన్నా చాలా ఇష్టం. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా పాటలకు వార్నర్‌ డ్యాన్స్‌లు వేశాడు. ముఖ్యంగా `అల వైకుంఠపురములో..` సినిమాలోని అన్ని పాటలకూ వార్నర్ స్టెప్స్ వేశాడు. తన సతీమణితో కలిసి `బుట్ట బొమ్మ` పాటకు చిందులేశాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ పాట తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది. యూట్యూబ్లో ఈ పాటకు 450 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అల్లు అర్జున్ ను అభినందించాడు. బుట్టబొమ్మ సాంగ్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి `వెల్‌డన్ అల్లు అర్జున్` అని కామెంట్ చేశాడు.