మహారాష్ట్ర ప్రభుత్వం “దావుద్ ఇబ్రహీం” నివాసాన్ని ఎందుకు కూల్చలేదు..?

ప్రముఖ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పటి నుండీ మహారాష్ట్ర సర్కార్ ను బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా మహారాష్ట్ర సర్కార్ కు సవాల్ చేస్తూ ముంబైలో అడుగుపెట్టి నన్నేమి చేయలేరని చెప్పకనే చెప్పింది. దీనితో మహారాష్ట్ర సర్కార్ కంగనాపై ఉన్న కక్షను ఆమె నివాసంపై చూపించి అది అక్రమ కట్టడం అని బాంబే హైకోర్టులో స్టే ఉన్న లెక్కచేయకుండా కూల్చేసింది.

దీనిపై మాజీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ముంబైలో కంగనా నివాసాన్ని కూల్చిన శివసేన సర్కార్ దావుద్ నివాసాన్ని ఎందుకు కూల్చలేదని, అతడి నివాసాన్ని కూల్చే దమ్ము లేదా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిందని ఆమె నివాసాన్ని కూల్చడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. కంగా రనౌత్ మీద పెట్టిన శ్రద్ధ కరోనా వైరస్ పై పెట్టినట్లైతే కరోనా మహారాష్ట్రలో ఎప్పుడో తగ్గిపోయేదని మాజీ సీఎం విమర్శలు చేశారు.

ఇక కంగనా రనౌత్ లాంటి ఒక మాములు హీరోయిన్ పై ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కామెంట్స్ చేయడంతో ఆమె నేరుగా సీఎంపైనే ఫైర్ అవ్వడంతో ఇప్పుడు ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ గా మారింది. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే పై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే శరద్ పవర్ కూడా ఒక హీరోయిన్ తో సీఎం స్థాయిలో ఉన్న నీకు ఏమి పనని గట్టిగా ఉద్ధవ్ కు క్లాస్ పీకారు. సుశాంత్ హత్య విషయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే పేరు కూడా రావడం తెలిసిన విషయమే.