విద్యా దీవెన సభలో పెళ్లిళ్ల ప్రస్తావనలెందుకు: కిరణ్ రాయల్

  • పవన్ పై వ్యక్తిగత దూషణలు చేసే ముందు అద్దంలో మీ మొహం ఒక్కసారి చూసుకొండి
  • రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలను దృష్టి మళ్లించడానికే జగన్ ఈ విమర్శలు
  • పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే మేము కూడా మీ పై వ్యక్తిగత దూషణలు చేస్తాం
  • ఎలా మాట్లాడాలో పక్క రాష్ట్రాల వారిని చూసి నేర్చుకోండి
  • జగన్ పైకి చెల్లెలు షర్మిల బుల్లెట్ లా వస్తోంది
  • గ్రంధి శ్రీనివాస్ ఆర్థిక నేరస్థుడు, వైసీపీ పతనం కాయం
  • పవన్ ను చూసి జగన్ కు ఓటమి భయం పట్టుకుంది
  • జనసేన పార్టీ జోష్యం

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు పదేపదే చేస్తే, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వంపై ప్రజలు చేస్తున్న నిరసనలు, ఆందోళనలను పక్కదారి పట్టించవచ్చుననే పన్నాగంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విద్యా దీవెన సభలో మాట్లాడడం నీచ రాజకీయ సంస్కృతి అని ఇలాంటి రాజకీయాన్ని తమ జనసేనాని తమకు నేర్పలేదని, వ్యక్తిగత దూషణలు చేయవద్దఅన్నారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, నగర ఉపాధ్యక్షుడు బాబ్జి లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు జనసేన నాయకులు కొండా రాజమోహన్, మునస్వామి, గుట్టా నాగరాజు, దినేష్ జైన్ రమేష్ నాయుడు, హిమవంత్, మనోజ్, షరీఫ్, సాయి దేవ్, రాజేంద్ర లతో కలిసి వీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేసే ముందు అద్దంలో మీ మొహం ఒక్కసారి చూసుకోవాలని, సంక్రాంతి పండుగ తరువాత సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా వైసిపిపై యుద్ధం ప్రకటించనున్నదని, ముందు మీరు మీ ఇంట్లో రాజకీయాలు సరి చూసుకోవాలని హెద్దేవ చేశారు. స్టేట్లో అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్స్ లు వారి సమస్యలపై పోరాడుతుంటే వారికి న్యాయం చేయలేని సీఎం ఇలాంటి ఎన్నో సమస్యలను పక్కదారి మళ్లించడానికి తమ అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు చేస్తున్నాడని, ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని, మరోమారు వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని దుయ్య బట్టారు. పక్క తమిళ రాష్ట్రం సీఎం స్టాలిన్ చూసి జగన్ ఎంతో నేర్చుకోవాలన్నారు కానీ తెలంగాణ సీఎం కెసిఆర్ అడుగుజాడల్లో జగన్ నడుచుకుంటున్నాడని బిఆర్ఎస్ కు పట్టిన గతే ఆంధ్రప్రదేశ్లో వైసిపికి పడుతుందని వారు భవిష్యత్తు ను గుర్తు చేశారు.