పక్కా ఇల్లు అందించడంలో ఎందుకు జాప్యం..? దారం అనిత

మదనపల్లె, నాడు పదేపదే పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రశ్నించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వాటిని అందించడంలో ఎందుకు జాప్యం చేస్తోంది. 1.40 లక్షల కోట్లు పేదల సంక్షేమానికి ఖర్చు చేశాం ముఖ్యమంత్రి మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు సలహాదారుల కొరకు పదే పదే చెబుతున్న మాట ఇది మరీ ఇంత పెద్దమొత్తం ప్రభుత్వానికి గృహాలు కనిపించలేదా వాటి కోసం కనీసం ఐదు వందల కోట్లు ఖర్చు చేయ లేదా అయితే ఇప్పటికే పూర్తయిన 1.50 లక్షల ఇళ్లను మూడు నెలల్లోనే పేదలకు ఇచ్చేయచ్చు, అలాంటిది మూడేళ్లుగా ఎడతెగని జాప్యం ఎందుకు చేస్తోంది. పేదలకు గూడు కల్పన సంక్షేమంలోకి రాదా..? గత ప్రభుత్వ హయాంలో 90% పైగా పూర్తయిన వేల గృహాలకు పాడుబెట్టడం ఎందుకు???? వాటిని పేదలకు అందచేసై అద్దె ఇళ్ళలో ఉంటూ ఏడాదికి 50వేల రూపాయల నుండి 60 వేల రూపాయలు చెల్లించ లేక అవస్థలు పడుతున్న వారికి ఆ మొత్తం మిగులుతుంది కదా ఆరు నుండి ఎనిమిది లక్షలు వెచ్చించి ఇస్తే ఇంటి స్థలంతో కలిపి పది లక్షల నుండి 15 లక్షల ఆస్తి అందించినట్లు అవుతుంది కదా… పేదలకు ఇండ్లు అందించడంలో ప్రభుత్వానికి పిల్లిమొగ్గలు ఎందుకు? అని జనసేన పార్టీ కార్యదర్శి దారం అనిత అన్నారు.