పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యోధుడు

  • ప్రజా సమస్యలపై జనసైనికుల పోరాటం స్ఫూర్తిదాయకం
  • వైసీపీ పాలనలో రాష్ట్రంలో చెడు జరగని గడప లేదు
  • అందరం ఒక్కటిగా రాష్ట్రాన్ని కాపాడుకుందాం
  • పశ్చిమ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి

గుంటూరు: జనసేన పార్టీ అధినేత ప్రజా పోరాట యోధుడని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. పార్వతీ పురంలోని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి ఇంట్లో జనసైనికులతో ఆమె మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనపై జనసైనికుల పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. టీడీపీ జనసేన బీజేపీ ల ఉమ్మడి పొత్తు అధికారం కోసం కాదన్నారు. ఐదేళ్లుగా వైసీపీ చేతిలో చిక్కి శల్యమవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీలు ఒక్కతాటిపైకి వచ్చారన్నారు. జగన్ రెడ్డి అరాచకపాలనతో రాష్ట్రంలో బాధలు పడని కుటుంభం లేదన్నారు. చెడు జరగని గడప లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలందరూ ఒక్కటై ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టినప్పుడే భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆళ్ళ హరి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో పెల్లుబికుతున్న అసంతృప్తి జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన వైసీపీకి ఘోరీ కట్టేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్నారని ఆళ్ళ హరి అన్నారు. అనంతరం గల్లా మాధవిని రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ బీసీ నాయకులు గడ్డం రోశయ్యలు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. షేక్ నాజర్, నండూరి స్వామి, స్టూడియో బాలాజీ, గొట్టిపాటి రమేష్, గల్లా జానకి రామ్, ఏసుబాబు, టీడీపీ యస్సి సెల్ నాయకుడు బాషా, పగిడిపోగు రమేష్, శెట్టి శ్రీను, తాడికొండ శ్రీను, సలాం, బబ్లూ, బాలు తదితరులు పాల్గొన్నారు.