జడ్పిటిసి గెలుపే లక్ష్యంగా దుమ్మురేపే ప్రచారం

రాజంపేట, ఒంటిమిట్టలో జరగనున్న జడ్పిటిసి ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం కోసం రాజంపేట పార్లమెంట్ జనసేన ఇన్‌చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహంపై చర్చించిన ఆయన, గత నాలుగు రోజులుగా జనసేన శ్రేణులు, స్నేహితులు, బంధువులు, స్థానిక రాజకీయ నాయకులను రంగంలోకి దింపి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. కార్యక్రమంలో బోడగల చంద్రబాబు, రామ్మోహన్ శ్రీనివాసులు, సూరిబాబు, రామలక్ష్మయ్య, రాజేష్ రాంబాబు, సాయిరాం, రమేష్, యల్లటూరు శివరామరాజు, సమ్మెట శివప్రసాద్, కల్లి రెడ్డప్ప, మునగపాటి వెంకటరమణ, మామిళ్ళ శ్రీహరి, కడప వెంకటసుబ్బయ్య, నామాల వెంకటయ్య, సాదు శ్రీను, అవ్వరు మహేంద్ర, పన్నెల విగ్నేష్, పివిఆర్ కుమార్, లక్ష్మీపతి రాజు, నారదాసు రామచంద్ర, పత్తి నారాయణ, ఆకుల చలపతి, కటారు బాబు, మౌలా ప్రసాదు, సాయి రాజు, సురేంద్ర, పూల లక్ష్మీ నరసయ్య, బొడిచర్ల శీను తదితరులు, అలాగే కూటమి ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment