బోరుకు మరమ్మతులు చేయించిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లె మండల పరిధిలోని జీ రెడ్డి వారి పల్లి పంచాయతీ, కోనంకి వారి పల్లి హరిజనవాడలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాజీ డిఆర్డిఏ అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు బోరుకు మరమ్మతులు చేయించి, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న బోరుకు మోటరు కాలిపోవడంతో తాగునీటి సమస్య ఉండడంతో జనసైనికులు యల్లటూరు శ్రీనివాస రాజు గారి దృష్టికి తీసుకెళ్లడంతో బోరుకు, మోటర్కు మరమ్మత్తులు చేయించి తాగునీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామస్తులు, జనసైనికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.