కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ

నెల్లూరు: మల్దేవ్ కాలువ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి వైసిపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకుంటుంది అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డ్రైనేజీ డిపార్ట్ మెంట్ డిఈ మధు కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మల్దేవ్ కాలువను కాలువ పునర్వవస్థీకరణకు 2019లో అప్పటి జలవనరుల శాఖ అనిల్ కుమార్ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకి 75 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికీ ఆ నిధులు కాంట్రాక్టర్ల కు అందలేదు. సగం పూర్తి అయినా కాంట్రాక్టర్లకు డబ్బు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అవస్థలు పడుతున్నారు. పని చేసిన తాలూకు నిధులు వస్తే తప్ప మిగిలిన పనులు చేయలేమంటూ ఎక్కడ పనులు అక్కడే ఆపేసిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేసి మల్దేవు కాలవ పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాల్సిందిగా డ్రైనేజీ డిపార్ట్మెంట్ డిఈ కి ఫిర్యాదు చేశాం అని తెలిపారు.