పోలవరంపై చర్చ కోసం పట్టు బట్టిన వైసిపి ఎంపిలు..

ఏపీ ప్రజలకు ప్రతిష్ఠాత్మకమైంది పోలవరం ప్రాజెక్టు. విభజన చట్టంలో భాగంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా పోలవరం విషయంలో చర్చకోసం పట్టుబట్టింది. సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సభ ప్రారంభం కాగానే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని వైసీపీ ఎంపీలు డిమాంచ్ చేశారు.వెల్‌లోకి దూసుకెళ్లి..నిరసన తెలిపారు. పోలవరంపై వాయిదా తీర్మానానికి ఎంపీ మిధున్ రెడ్డి నోటీసిచ్చారు. వైసీపీ సభ్యుల ఆందోళన నేపధ్యంలో సభ మద్యాహ్నం 3.30 గంటల వరకూ వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది వైసీపీ ఆరోపణ.