భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలి: ఎన్ని రాజు

రాజాం: స్వాతంత్ర సమరయోధుడు, చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా గురువారం
రాజాం జనసేన నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు మరియు జనసైనికులు ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్నిరాజు మాట్లాడుతూ.. “భగత్ సింగ్ జ్వలించే ఒక నిప్పు కణిక అని, అతని యొక్క పోరాట స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చుకొని ప్రజా సమస్యల పై పోరాటం చేయాలని ఉద్బోధించారు. అలాగే “విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా మొదటిగా ప్రాచర్యాన్ని కలిపించిన వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేగిడి మండల అధ్యక్షుడు అప్పలనాయుడు, ప్రవీణ్, అన్నం నాయుడు, నమ్మి.దుర్గారావు, సూర్యనారాయణ, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.