వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం

వినూత్న పధకాల్ని ప్రవేశపెడుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ మరో పధకాన్ని ప్రారంభించనున్నారు.

ఏపీలో గర్భిణీ, బాలింతల కోసం ప్రత్యక పధకం ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నారు. అదే వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం. ఈ పథకం గర్భిణీలు, బాలింతల కోసం ఉద్దేశించినది. దీని ప్రకారం గర్భిణీలకు, బాలింతలకు, 36 నెలల్నించి 72 నెలల్లోపు పిల్లలకు, 36 నెలల్లోపు పిల్లలకు ఇలా ప్రత్యేకంగా పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పధకం కింద ఒక్కొక్కరిపై ప్రభుత్వం 412 రూపాయలు ఖర్చు చేయనుంది. వైఎస్సాప్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని రెండు పథకాలున్నాయి. ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందే లబ్దిదారుల సంఖ్య 30 లక్షల 16 వేలుగా గుర్తించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించడమే ఈ రెండు పథకాల లక్ష్యం.