జయహో బీసీ సభ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వానికి అర్హత లేదు

విజయవాడ: వైసీపీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, నిరుపేదల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయని జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు, న్యాయవాది ఎం హనుమాన్ అన్నారు. జయహో బీసీ సభ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వానికి అర్హత లేదని, స్కీముల పేరిట వైసీపీ నేతలు స్కాములు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పథకం అందచేసిందని ఆయన ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజల ఖజానాను కాజేసి బీసీ విదేశీ విద్యలను విధులను మంజూరు చేశారా అంటూ.. దీనికి సమాధానం చెప్పండి, గొప్పలు చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి చేతకాదు అని అన్నారు. జయహో బీసీ సభ పెట్టడానికి వైఎస్ఆర్సిపికి అర్హత లేదని తెలియజేసారు. వైఎస్ఆర్సిపి నాయకులు స్కీములు పేరుతో స్కాములు చేస్తున్నారని, అరాచకపాలన చేస్తున్నానని వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ప్రజలంతా తగు రీతిలో గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. ఈ రోజుల్లో రిజర్వేషన్ కేటాయిస్తున్న నామినేట్ పదవులను 80% రెడ్డి సామాజి వర్గానికి చెందాయి. జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేసి జయహో బీసీ సభకు ప్రభుత్వం అనార్హులని, కేవలం ప్రభుత్వం బిసిలని ఓట్లుగానే చూస్తుంది గానీ బీసీకి అందాల్సిన నిధులు గాని నామినేట్ పదవులు గాని ఈ రోజున అందలేదు జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు న్యాయవాది ఎం హనుమాన్ ఎద్దేవా చేసారు.