రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గెలుపుతోనే సాధ్యం: జానీ మాస్టర్

  • పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తారు..
  • కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానినే..
  • కేరీర్ బిల్డింగ్ లో నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా సహాయం చేశారు

నెల్లూరు: ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. చాలా సార్లు, చాలా వేదికలపై ఈ విషయాన్ని జానీ మాస్టర్‌ స్పష్టం చేశారు. తాను ఈ స్థాయిలోకి రావటానికి పవర్‌ స్టారే కారణమని కూడా చెప్పారు. అంతేకాదు! జనసేన పార్టీకి కూడా ఆయన మద్దతు తెలిపారు. తన సొంత జిల్లా అయిన నెల్లూరు జనసేన పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ ఉంటారు. తాజాగా, నెల్లూరు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పవన్‌ కల్యాణ్‌ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీని గెలిపించండి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీ స్థానిక 51 డివిజన్ కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి గునుకుల కిషోర్ ఆహ్వానం మేరకు కపాడిపాలెం విచ్చేసిన జానీ మాస్టర్ కేరింతల అభిమానుల మధ్య సభ కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గురించి, పవన్‌ కల్యాణ్‌ గురించి జానీ మాస్టర్‌ మాట్లాడుతూ.. కట్టె కాలే వరకు పవన్‌ కల్యాణ్‌ అభిమానినేనని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన కెరీర్‌ బిల్డింగ్‌లో పవన్‌ కల్యాణ్‌, మెగా ఫ్యామిలీ చాలా సహాయం చేసిందని అన్నారు. చిన్ననాటినుంచి నెల్లూరు సిటీలో చాలా ప్రదేశాల్లో తిరిగానని చెప్పారు. నెల్లూరునుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా అభిమానం సంపాదించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తారు, పవన్‌ కల్యాణ్‌ అనుకున్నది నెరవేరాలని ఆకాంక్షించారు. కిషోర్‌, అతడి బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి మంచి ఉదాహరణ జానీ భాయ్ జీవితం.. నెల్లూరు నుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న ఆయన కృషి అభినందనీయం..ఎప్పుడు జనసేన పార్టీ తరపున కార్యక్రమాలకు ఆహ్వానించినా ఒక్క క్షణం ఆలోచించకుండా మాకు ప్రత్యక్షమయ్యే మంచి మనసున్న జానీ భాయ్ కి అంతా మంచి కలగాలని కోరుకుంటున్నాను..ఆయన చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా చాలా చాలా ఇష్టం అభివృద్ధి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకెళ్లాలి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అని తెలిపారు.