అట్టహాసంగా ప్రారంభమైన రాజానగరం మండల జనసేన నూతన కార్యాలయం

  • భారీగా తరలివచ్చిన జనసేన పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ
  • జనసేన జెండాలతో పూర్తిగా నిండిపోయిన నూతన కార్యాలయ ప్రాంగణం
  • రాజానగరం గడ్డ జనసేన అడ్డా
  • బత్తుల ఆధ్వర్యంలో 300 మంది జనసేన పార్టీలో చేరిక
  • జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట రామకృష్ణ గారి ఇంటి నుండి రాజానగరం నూతన జనసేన పార్టీ కార్యాలయం వరుకు వందలాది బైకులతో భారీ ర్యాలీగా వచ్చిన “బత్తుల”
  • ముందుగా రామాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలంలో జనశ్రేణులకు అందుబాటులో ఉండే విధంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా కనుల పండుగగా జనసేన పార్టీ వీరమహిళల నడుమ ఘనంగా ప్రారంభించిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం జనసేన నాయకులు తోట రామకృష్ణ ఆధ్వర్యంలో 300మంది నాయకులు బత్తుల బలరామకృష్ణ గారి చేతులు మీదుగా జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నూతన పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జనసేన జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బత్తుల ఆధ్వర్యంలో రాజానగరం నాయకులు జెండా ఆవిష్కారణ చేసారు. అనంతరం రాజానగరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జనసేన వీరమహిళలతో కలిసి మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనశ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.