అన్నమయ్య ప్రాజెక్టు బాధితురాలికి అతికారి దినేష్ అర్థిక సాయం

రాజంపేట: అన్నమయ్య ప్రాజెక్ట్ వరదల్లో సర్వం కోల్పోయినవాలలో గుండ్లూరు హరిజనవాడకు చెందిన గోర్ల వెంకట సుబ్బమ్మ ఒకరు. ఆమె చిల్లర అంగడి పెట్టుకొని వ్యాపారం చేసుకొనేది, అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో తన ఆంగడి కొట్టుకొని పోవడం వల్ల తనకు బ్రతుకు దెరువు లేకుండా పోయింది అని అధికారులు చుట్టు, అధికార నాయకులు చుట్టు దాదాపు 2 1/2 సంవత్సరాలు తిరుగుతున్న పైస సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు అని రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ దృష్టికి తీసుకరావడంతో ఆయన తక్షణ సాయం క్రింద బాధితురాలికి రు.10 వేల రూపాయలు అర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు వరదలు వచ్చి పోయి సంవత్సరాలు గడుస్తున్న ఇంత వరకు బాధితులకు వైసిపి ప్రభుత్వం అదుకోవడంలో వైఫల్యం చెందింది. గోర్ల వెంకట సుబ్బమ్మ ఒక దళిత మహిళ ఆమె తన జీవనోపాధి అయిన తన చిల్లర ఆంగడిని వరదల్లో కొల్పోయి సాయం కోసం అధికారులు చుట్టు, అధికార వైసిపి పార్టీ నాయకులు చుట్టు ఆఖరికి స్పందనలో అర్జి పెట్టుకున్న ఈ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం చూస్తుంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలపై సీఎం జగన్ రెడ్డి కపట వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన-బీజేపీ-టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాగనే గొర్ల వెంకటసుబ్బమ్మను అన్ని విధాల అందుకుంటాం అని తెలియజేశారు. ఈ కార్యలయంలో జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.