అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న విస్సన్నపేట మండల జనసేన పార్టీ

విస్సన్నపేట: గత మూడు రోజుల క్రితం విస్సన్నపేట మండలం తాతగుంట్ల గ్రామపంచాయతీ పరిధిలో గౌరవం పాలెం గ్రామంలో షేక్ బాజీ గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురైనది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆ కుటుంబానికి భరోసాగా వంట సామాన్లు, కిరాణా సరుకులు, దుప్పట్లు, విద్యుత్ బల్బులు, మిక్సీ తదితరసామాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విస్సన్నపేట మండల అధ్యక్షులుషేక్. యాసిన్, గౌరంపాలెం గ్రామ అధ్యక్షులు షేక్. కాలీషా, విస్సన్నపేట పట్టణ అధ్యక్షులు నందమూరి. వెంకటేశ్వర రావు, మండల ప్రధాన కార్యదర్శి సాలి. నాగరాజు, మండల నాయకులు తోట. కృష్ణ కిషోర్, కస్తూరి సీతా రామ స్వామి, చింతల పండు, నిగమాను చెన్నారావు, పసుపు లేటి సతీష్, దారావత్తు ప్రకాష్, పండు, షేక్ ఫిరోజ్, కుమార్ కోచింగ్ సెంటర్ అధినేత అప్పికట్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.