పలాసలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం

పలాస, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలాస జనసేన పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ జనసేన పార్టీ నాయకులతో, జనసైనికులతో కలిసి నియోజకవర్గ సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఎస్‌ఐ కోన కృష్ణారావు జెండాను ఆవిష్కరించారు తరువాత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ని రోజులు పార్టీ ఎలా అభివృద్ధి చెందిందో గుర్తు చేసుకున్నారు. కోన కృష్ణారావు మాట్లాడుతూ కష్ట కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జనసైనికులు, వీర మహిళలు, పార్టీకి అయువు పట్టు అని, రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ పాత్ర చాలా కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు నందిగాం ధర్మారావు, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు గిరీష్, సాయి, శ్రీకాంత్, పుక్కళ్ళ ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.