హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం: కేటీఆర్

హైదరాబాద్ నగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తున ప్రతిష్ఠిస్తామని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేటీఆర్, 125 అడుగుల ఎత్తున ఈ విగ్రహం ఉంటుందని తెలిపారు. అందరికీ సమాన హక్కులు ఉండాలన్న అంబేడ్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

కాగా, నేడు అచ్చంపేటలో పర్యటించనున్న ఆయన అంబేడ్కర్ భవనానికి, స్మృతి వనం, అగ్రికల్చర్ మార్కెట్ తదితరాలకు శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అంతకుముందు ఈ ఉదయం నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటన ప్రారంభం కానుంది జడ్జర్లలో మినీ ట్యాంక్ బండ్, కావేరమ్మ పేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్లను ఆయన పరిశీలించనున్నారు.