Kakinada: సిటీ జనసేన పార్టీ ఆఫీసులో వీరనారికి 193వ ఘన నివాళి

సాధారణ యువతి “మణి కర్ణిక” అసాధారణ సామ్రాజ్ఞిగా ఎదిగి సమర్థవంతమైన పాలనచేసి పరాయి పాలన నుండి విముక్తి కోసం స్వపరిపాలన కోసం పరితపించి సమరంలో అమరురాలై అజరామర కీర్తిని సాధించిన ఆనాటి ఝాన్సీ రాజ్య మహారాణి నేటికీ ధీర వనిత, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా కాకినాడ సిటీ జనసేన పార్టీ ఆఫీసులో 193 వ ఘన నివాళి అర్పించడం జరిగింది ముఖ్యఅతిథిగా తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి జిల్లా కార్యదర్శి అట్లా సత్యనారాయణ, వాసిరెడ్డి సతీష్, సుంకర శ్రీనివాస్, వీరమహిళలు, జనసైనికులు, శిరీష, బి.మరియా, బి. లీల, పి. విజయ భాస్కర్, డి. అర్జున్, వి. హరికృష్ణ, వి. సతీష్, రమణ, వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.