20 లక్షలు చెరువులో పొసేసారు: జనసేన కౌన్సిలర్ దేవి హారిక

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణం 8వ వార్డులో ఉన్న గరిగుంట చెరువు ఔట్లెట్స్ మూసివేయడంతో వీధుల్లో మురుగు నీరు పోక దుర్గందం వెదజల్లుతోందని ఏడో వార్డు జనసేన కౌన్సిలర్ గండి దేవిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం అనాలోచిత చర్యలు వల్ల చుట్టుపక్కల వీధులు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే ధ్యేయంగా గరిగుంట చెరువు చుట్టూ పార్క్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని ఆమె మండి పడ్డారు. ఇప్పటికైనా పాలకులు సమస్యను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.