శశిధర్ అధ్యక్షతన జనసేన కాకినాడ సిటీ నియోజకవర్గ 21వ డివిజన్ కమిటీ సమావేశం

కాకినాడ సిటీ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ మరియు రాష్ట్ర పీఏసీ సభ్యులు శశిధర్ అధ్యక్షతన ఆదివారం ఉదయం 10.00 గంటలకు జనసేన పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలోని 21 వ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో హాజరు అయిన కార్యవర్గ సభ్యులందరు తమ డివిజన్ కి సంబంధించిన సమస్యలు అన్ని వివరంగా తెలియజేసారు. అలాగే గతంలో ముత్తా శశిథర్ కుటుంబ సభ్యుల వల్ల పొందిన ఉపయోగాలు కాకినాడ సిటీ అభివృద్ధికోసం ఏర్పాటు చేసనపార్కులు, రహదారులు గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ముత్తా శశిథర్ మాట్లాడుతూ డివిజన్ పరిధి లోని ప్రతి ఒక్కరిని కలసి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు వారు చేసే సేవా కార్యక్రమాలు, క్రియాశీలసభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగాలు తెలియజేయాలని అలాగే తరచుగా వార్డు పరిధిలో పర్యటిస్తు సమస్యలు తెలుసుకొని వాటిని అధికారుల దృష్టి కి తీసుకొని వెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.ఈ సమావేశంలో సిటీ కమిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, 21వ డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాదు మరియు మిగతా కార్యవర్గ సభ్యులు పిల్లి తులసి, దుర్గా సింగ్, గ్రంధి నాని, గుర్రాల సతీష్, మణీశ్వర రావు, వర్మ, ముస్లిం సోదరులు రెహమాన్, కరిముల్లా, పాల్గొన్నారు.