ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 30 వ రోజు పాదయాత్ర

ఏలూరు, వైసీపీ పాలనలో అభివృద్ధి తిరోగమనమేనా? కనీసం రహదారులకు కూడా మరమ్మతులు చేయలేరా అని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన రెడ్డి అప్పల నాయుడు ఆదివారం స్థానిక 12 వ డివిజన్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న కుండీ బొమ్మ సెంటర్ ఏరియాలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో ఆయన ఇంటింటికీ పాదయాత్రగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వ్యవస్థలు కూడా అసమర్థ పాలన వలన నిర్వీర్యం అయ్యాయని, కనీస సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దీంతో ప్రజలు నిరంతరం కష్టాలు పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏలూరు నియోజకవర్గంలో వివిధ డివిజన్ లో పర్యటించానన్నారు. అన్ని డివిజన్ లు అనేక రకాల సమస్యలు ఉన్నాయని, పాలకులు ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రహదారులు కూడా సజావుగా లేకపోవడంతో రాకపోకలు సాగించేందుకు కష్టాలు పడుతున్నారు. రోడ్లన్నీ గోతుల మయం కావడం నాలుగు చినుకులు పడితే మినీ చెరువులు వలే రహదారులు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సజావుగా లేకపోవడంతో మురుగునీరు కలయికతో రోడ్లకు దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని నగరపాలక సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాగాని చిన్నపాటి పనులు కూడా చేయలేకపోయారని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళనాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీకు ఏలూరు ప్రజలు పదవిని కట్టబెట్టింది అలంకరణ కోసం కాదు. ప్రజలు అనేక రకాల అవస్థలు పడుతున్నారు అవి మీకు కనిపించడం లేదా ? ప్రజలకు ముఖ్యమైన మంచినీరు, రహదారుల సమస్యలపై కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలు అనారోగ్యం పాల్వుతున్నారు. పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండటంతో దోమలు పెరిగాయని, పందులు సంచరించడంతో అనారోగ్య పరిస్థితులు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రజలు ఆగ్రహానికి గురికాకముందే పాలకులు అధికారులు స్పందించి ప్రజల కనీస సౌకర్యాలను, మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని రోడ్లపై ఉన్న గోతులను పూడ్చాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసు, కందుకూరి ఈశ్వరరావు, వల్లూరి రమేష్, అగ్గాల శ్రీనివాస్, బుధ్ధ నాగేశ్వరరావు, సురేష్, గోపి, పొన్నూరు రాము, శివ, దుర్గారావు , తోట రవి, మజ్జి శ్రీనివాస్, వేముల బాలు, స్థానిక నాయకులు అగ్గాల ప్రతాప్, హరికృష్ణ, యేసు, యువి, రామ్ కిరణ్, మురళి, రాము, పండు, ఫణి, గనిరెడ్డి కిరణ్, కేశవ వీరమహిళలు లంకా ప్రభావతి, సరళ, తుమ్మపాల ఉమాదుర్గ, దుర్గ బి తదితరులు పాల్గొన్నారు.