ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఆమదాలవలస నియోజకవర్గం, ఆమదాలవలస మండలం, సైలడా పంచాయతీ పరిదిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నాయకులు కోరుకొండ మల్లేశ్వర రావు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియుఈ కార్యక్రమంలో భాగంగా 186 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనీ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.