సర్వేపల్లిలో జనం కోసం జనసేన 32వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం, రామదాసు సత్రం నందు జనం కోసం జనసేన 32వ రోజు కార్యక్రమాన్ని మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా.. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన అవినీతిపరులు దుర్మార్గులు దుష్టులు నీచాతి నీచంగా మాట్లాడుతూ.. దుర్మార్గపు దుర్వినియోగపు పరిపాలన కొనసాగుతుంది. ఈ దుర్మార్గుల భారి నుండి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పార్టీ జనసేన పార్టీ, రామరాజ్యం కోసం పోరాడుతున్న నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలలో పెరిగిన ఆదరణ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగడంతో వైసిపి నాయకులు ఓర్వలేక మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కోసం వాళ్లు కొంతమంది వైసిపి నవరత్నాలని తీసుకువచ్చి మంత్రులుగా పదవి ఇచ్చి వాళ్లని ప్రోత్సహిస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే వారు ఆ పదవులను తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పక్కదోవన పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు తిట్టే తిట్లని ఆనందంగా వింటూ సునతానందాన్ని పొందుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగ్గు భాయ్ మీకు 2024 లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారే గుర్తుపెట్టుకో హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి ఈ కార్యక్రమంలో మండల నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ఖాజా, వంశీ, సాయి, తదితరులు పాల్గొన్నారు.