గిరిసేన జనసేన జనం వద్దకు జనసేన 32వ రోజు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం గిరిసేన జనసేన జనం వద్దకు జనసేన 32వ రోజు పర్యటనలో భాగంగా బొడ్లపాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. జనసేన జానీ మాట్లాడుతూ అంగన్వాడీ స్కూల్ లో పిల్లలకి సరైన ఆట వస్తువులు లేవు ఆలానే అంగన్వాడీ బిల్డింగ్ మొత్తం పగుళ్ళతో ఉందని ఏ క్షణం అయినానా, ఎప్పుడైనా జరగరానిది ఏమి జరిగినా సరే ఆ పసిపిల్లలు పరిస్థితి ఏంటి ఆలాగే స్కూల్ ఆవరణలో పరిసర ప్రాంతం చుట్టుపక్కల చుట్టూ అడివిలా ఉండటంతో పాములు వచ్చే పరిస్థితి కూడా ఉన్నదని, అదే దారిలో గ్రామ మహిళలు బోరింగికి వెళ్లవలిసి వస్తుందని బొడ్లపాడు గ్రామ జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జనసేన జానీ ప్రశ్నించారు. కనుక దీనినీ దృష్టిలో పెట్టుకొని మా ఊరు అంగన్వాడీ బిల్డింగ్ సాంక్షన్ చెయ్యాలని మరియు చుట్టుప్రక్కల ప్రహరిలా కట్టించాలి అని పిల్లలకి రక్షణగా ప్రభుత్వం నాయకులు పని చెయ్యాలి అని జనసేన జానీ కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.