జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 33వ రోజు

రాజానగరం నియోజకవర్గం, జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 3వ రోజులో భాగంగా మంగళవారం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. జనసేన నాయకురాలు ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనసేనశ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాలు ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలలా ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని, జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో మట్ట వెంకటేశ్వరరావు, లింగరాజు బిళ్ళ, సంగన జయ ప్రకాష్, అల్లం దుర్గా ప్రసాద్, మరే మణి, బిళ్ళ బలరాం కృష్ణ, గెడ్డం వెంకట రత్నం, స్వామేశ్వర రావు, పెనుగొండ నాగేంద్ర, పృథ్వి, మోర్త శ్యామ్, రావూరి దుర్గా ప్రసాద్, కోణాల దుర్గా ప్రసాద్, పెంటపాటి శివ, హుస్సేన్, నెదురి పోసియ్యా, కరుణాకర్ బోడపాటి, మండా గౌతం, ప్రకాష్, భాస్కర్, చరణ్, కోనే శ్రీను, గడగట్టి ప్రశాంత్ కుమార్, ముత్యాల హరీష్, కొండటి సత్యనారాయణ, బైలపూడి శ్రీను, సందీప్, బ్రహ్మలతో పాటు నియోజకవర్గ జనసేన శ్రేణులు మరియు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.