జనసేన గిరిసేన – జనం వద్దకు జనసేన 38వ రోజు

పాలకొండ: జనసేన – గిరిసేన కార్యక్రమం లో భాగంగా 38 వ రోజు వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామం లో నీరు సమస్య పైన జనసేన జానీ బొడ్లపాడు స్థానిక ప్రజలతో సమస్య పైన స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు మహిళలు మాట్లాడుతూ ఊరికి ఒకే బోరింగ్ ఉండటం ఒక సమస్య ఐతే ఉన్నా ఆ ఒక్క బోరింగ్ కూడా పని చెయ్యకపోవడంతో గ్రామ ప్రజలు చాలా అవస్థలుపడుతున్నారు. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కొళాయి పైపులు లేవు ఉన్నా వాటర్ ట్యాంక్ పని చెయ్యడం లేదు. మా గ్రామాన్ని పట్టించుకునే నాయుకులు కూడా ఏ ఒక్కరూ లేరు అని జనసేన జానీ డిమాండ్ చేస్తూ వెంటనే పరిష్కారం జరగాలని అధికారులకి ఈ విధంగా తెలియజేస్తున్నాం.