హైదరాబాద్‌ చేరుకున్న 40 ఏపీ బోట్లు

భారీ వర్షాలు, వరదల కారణంగా  విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా సిద్ధం అవుతోంది. అధికారులు సిద్ధంగా ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరం అయ్యే బోట్లు నగరానికి చేరాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టూరిజంకు చెంది పలు ప్రాంతాల నుంచి సుమారు 40 బోట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. ప్రస్తుతం నగరంలో వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సరిపడా బోట్లు లేవు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ముందు ప్రస్తావించగా యుద్ధప్రాతిపదికగా తగిన ఏర్పాట్లు చేయమని తెలిపారు.