బెంతు ఒరియాల నిరాహార దీక్ష 43వ రోజు

ఇచ్చాపురం: కవిటి మండల కేంద్రంలో కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బెంతో ఒరియాల నిరాహార దీక్ష 43వ రోజు శిబిరంలో పెద్ద ఆముదాలపుట్టుగ గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్బంగా కుల పెద్దలు మాట్లాడుతూ.. విధ్యా, ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్న భారత రాజ్యాంగ షెడ్యూల్ లో గల బెంతో ఒరియా సామాజిక వర్గం కుల సమస్య ప్రశ్నార్థకంగా మిగలడం, యే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గుర్తించక పోవడం బాధాకరం. కేవలం ఓట్లు కోసమే పార్టీలు హామీలు ఇచ్చి విస్మరించడం గెలిచాక ఒక భూటకపు కమిటీలతో కాలం గడిపే విధంగా చేస్తున్నారు. బెంతో ఒరియాలు దశాబ్దాల నుండి రాజకీయ సుడిగుండంలో చిక్కుకుపోయి న్యాయంకోసం ఉద్యమాలు చేస్తున్న పట్టించుకోని సందర్భంలో రాజకీయ లబ్ది నాయకుల ముసుగులో గిరిజన ఆదివాసీ సోదరులు చేస్తున్న కపట ఉద్యమంలో నిరాధార ఆరోపణ బెంతో ఒరియాలను ఈ రాష్ట్రంలో గుర్తింపు జిల్లాలో మనుగడ లేకుండా కనుమరుగు కోసమే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రతినిధులు కోరారు. వై సీ పీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఓసీలో ఉన్న వివిధ కులాలను బీసీలో చేర్పించారు. కానీ పూర్వం నుంచి యస్ టీ లుగా ఉన్న మాకు మాత్రం కనీసం నేటివిటీ కూడా ఇవ్వకపోవడం దాని వెనుక స్థానిక నాయకులు మా సమస్యను గాలికి వదిలేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయకపోతే బుద్దిచేపుతం అని నినాదాలతో ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భుదేవ్ దొలై, వేణు సాహు, సింహాద్రి సాహు, గుణా సాహు, రుస్య, కుర, ప్రశాంత్ ఉపాధ్యక్షులు జయసేన్ బిసాయి, సెక్రెటరీ దుదిస్టి మజ్జి, కృష్ణ దొలై తదితరులు పాల్గొన్నారు.