నో మై కాన్స్టిట్యుఎన్సి 45వ రోజు

శ్రీకాళహస్తి, నో మై కాన్స్టిట్యుఎన్సి 45వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలో ఏమాత్రం అభివృద్ది ఈ 4 సంవత్సరాలలో జరగలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం మున్సిపాలిటీగా ఉన్నా కూడా ఏమాత్రం మౌళిక వసతులు సక్రమంగా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నితీష్ కుమార్, బాలాజీ, చందు చౌదరీ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.