పవనన్న ప్రజాబాట 47వ రోజు

  • జీవో 1 లాంటివి ఉంటే జగన్ రెడ్డి పాదయాత్రలు చేసేవాడా?

ఆత్మకూరు, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, శుక్రవారం 47వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతో జీవో 1 తీసుకువచ్చారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేయగలిగి ఉండేవారా? ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత. ఇలాంటి చీకటి ఉత్తర్వులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను, విశాఖ నగరంలో అక్టోబర్ లోనే వెల్లడించారు. వాహనంలో నుండి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, హోటల్ నుండి బయటికి రాకూడదు అని నిర్బంధాలు విధించారు. ఇప్పటం వెళ్ళరాదంటూ అటకాయించారు. ఈ పెడ పోకడల్ని అక్షరాల్లో ఉంచి జిఓగా తెచ్చారు. ఈ విధమైన చీకటి జీవోలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వాన్ని తీసుకువస్తున్న పాలకుల పోకడలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఉత్తర బలిజ వీధి, అంబేద్కర్ నగర్, మెయిన్ బజార్, బస్టాండ్ సెంటర్ ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవనన్న ప్రజాబాట సాగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, నాగరాజు, ఆనంద్, భాను, అజయ్, హజరత్ తదితరులు పాల్గొన్నారు.