మదనపల్లెలో జనసేన-టీడీపీల ఉమ్మడి ప్రచారం 53వ రోజు

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడిగా ప్రచారంలో భాగంగా 53వ రోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ రామాలయం వీధి సొసైటీ కాలనీ పి ఎన్ టి కాలనీ అబ్బాయి నాయుడు కాలనీ తదితర ప్రాంతాలలో విసిరితంగా పరిశీలించి ప్రజలతో మమేకమవడం జరిగింది. శ్రీరామ రామాంజనేయులు మరియు దారం అనిత ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ తల్లిని, చెల్లిని ఆదరించలేనివాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తల్లి చెల్లి అనడం ఇది ఒక నాటకంలో భాగమే. సొంత ఇంటికి చక్కబెట్టుకోలేక ఏదో సాధిస్తానని అది ఏదో చెప్పినట్టు అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి పరిపాటి అయిపోయింది ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని సాగరంపాలని రికార్డ్స్ అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా శ్రీమతి దారం అనిత మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కొరత పట్టణంలో తీవ్రంగా ఉందని తాగునీటి సౌకర్యం పూర్తిగా లేదని పారిశుద్ధ్య సమస్యలు అడుగడుగున కనబడుతున్నాయని ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వం కచ్చితంగా వీటి పైన దృష్టి సారించి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. పట్టణ అధ్యక్షులు నాయన జగదీష్ మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉటంకిచ్చినట్టు 98 శాతం గెలుపు సాధ్యం కావాలని, ఆ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అది మదనపల్లిలో సాధించి తీరుతామని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయన జగదీష్, జనసేన సోను, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, సుప్రీం హర్ష, తుపాకుల ధరణి రాయల్, యాసీన్, గని, వెంకటేష్, సిద్ధప్ప, చంద్రశేఖర్, పద్మావతమ్మ, ప్రభావతి, సుకన్య బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.