సర్వేపల్లి అభివృద్ధికి రాబోయే ప్రజా ప్రభుత్వంలో టీడీపీతో కలిసి జనసేన పార్టీ కృషి చేస్తుంది

తోటపల్లిగూడురు మండలంలోని తోటపల్లి బిట్టు – 2 నందు శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ నందు మోటార్ చెడిపోయి తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూఉంటే పంచాయతీ అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం ఈ స్థితిలో కూడా రాక్షస ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రజలను ఇంకెవరు పట్టించుకుంటారు. ఇటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, ఇటువంటి మంత్రి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా. ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు వీళ్ళకి పట్టవా. తాగడానికి నీళ్లు కూడా అందించాలని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రజల గురించి ప్రజల అవస్థల గురించి ఇంకేం పట్టించుకుంటారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలో కూడా ఎక్కడా కూడా పంచాయతీలలో కాలువలలో బ్లీచింగ్ కొట్టించిన పరిస్థితి లేదు. పంచాయతీలలో నిధులు ఉన్నాయా లేవా తోటపల్లి బిట్ వన్ నందు వారం లోపల వాళ్లకి మినరల్ వాటర్ మోటార్ను రిపేరు చేసి వెంటనే తాగునీరు అందించాలి అలా ఇవ్వని పక్షంలో మేమే ఆ మోటర్ నీ రిపేర్ మా సొంత నిధులతో చేయించి వాళ్లకి తాగునీరు అందిస్తాం. రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకు అండగా నిలబడి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని, మండల అధ్యక్షుడు సందీప్, కోర్ కమిటీ కార్యదర్శి కల్తి రెడ్డి శ్రీనివాసులు, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, స్థానిక నాయకులు బద్వేల్ చందు, రాయప్ప, వన్ బద్వేల్ చరణ్, రవి పాల్గొన్నారు.