నాయకంపల్లి గ్రామంలో జనం కోసం జనసేన 570వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 570వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 3550 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 571వ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ కి, గండేపల్లి మండలం సంయుక్త కార్యదర్శి బొట్ల రాజుబాబు కి, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు కి, చేవా చంద్రశేఖర్ కి, రామవరపు త్రినాధ్ కి, చేవా లక్ష్మణ్ కి, సందాసి వంశీ కి, బోడా అశోక్ కి, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు కి, చెక్కపల్లి సతీష్ కి, యర్రంపాలెం నుండి బిక్కిన కృష్ణార్జున కి, తుమ్మా వెంకన్నబాబు కి, యల్లమిల్లి నుండి పోసిన రాజు కి, ఉమ్మిడి తరుణ్ కి, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ కి, పిన్నం మణికంఠ స్వామి కి, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు కి, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు కి కృతజ్ఞతలు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సింగరంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కుక్కల సురేష్ కుటుంబ సభ్యులకు, మర్రిపాక గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పాటంశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు, వజ్రంగి వీరబాబు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.