జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రెడ్డి అప్పల నాయుడు

  • సిధ్ధం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఎన్నికల శంఖారాన్ని పూరిస్తున్నామని రెడ్డి అప్పల నాయుడు మండి పడ్డారు. జగన్ రెడ్డి నువ్వు దేనికి సిద్ధం అని ప్రశ్నించారు. నీ తల్లి నీ చెల్లే నిన్ను లెక్క చేయట్లేదే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని నువ్వు ఏ విధంగా ఉద్దరిస్తావని, అక్క చెల్లి అమ్మ అవ్వ అని అంటున్నావే సొంత తల్లిని చెల్లిని ఎందుకు గెంటేశావు..?? బాబాయిని మర్డర్ చేయించావు. కోడి కత్తి డ్రామా లాడి ప్రజల్ని మోసం చేసి ఐదు సంవత్సరాల నుంచి మొక్కుతున్న ఒక దళితుడి మీద కనీసం కనికరం లేకుండా చేస్తున్నావు. జైల్లో మగ్గుతున్న ఆ కోడికత్తి శ్రీను, నిన్ను గెలిపించుకోవడం కోసం నువ్వు ఆడిన డ్రామాల్లో భాగమైన ఆ కోడి కత్తి శీను మగ్గిపోవాల్సిందేనా.. రాష్ట్ర ప్రజానీకం ఇవన్నీ చూడటం లేదనుకుంటున్నావా?? ఈరోజు నువ్వు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని అంటున్నావే 2019లో కూడా నీ మాటలు నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచింది నువ్వు కాదా?? నువ్వు ఏదైనా మాట నిలబెట్టుకున్నావా?? సిపిఎస్ రద్దు చేశావా..?? మద్యపానం నిషేధం చేసావా?? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి హౌసింగ్ లోన్లు ఇచ్చావా?? ఇల్లు కట్టించావా?? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లను దోపిడీ చేసింది నువ్వు కాదా?? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశావు. పంచాయితీ ఎలక్షన్ ని సైతం నిర్వీర్యం చేశావు. సర్పంచ్లతో భిక్షాటన చేయించావు.. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీ బహిరంగ సభ కోసం స్కూల్ లన్ని మూతపడ్డాయి. విద్యారంగాన్ని వైద్య రంగాన్ని నాశనం చేసిన చరిత్ర ఒక నీకే చెల్లిందని తీవ్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పై విరుచుకుపడ్డారు. నువ్వు రాష్ట్ర ప్రజా నీకానికి ఏ విధంగా మేలు చేశావు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత నీకు ఉందా?? రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది నువ్వు కాదా?? న్యాయ వ్యవస్థల్ని అసలే లెక్క చేయవు. చీకటి జీవోలను తెస్తావు. 89 మంది సలహాదారుల్ని పెట్టుకుని దాదాపు 680 కోట్లు వాళ్లకు జీతాలుగా ఇస్తున్నావు.. మీ పక్కన ఉన్న గూండాలే నీకు సలహాదారులు.. మీ పార్టీలో తిరుగుతున్న చెంచా గాళ్లే నీకు సలహాదారులు.. అన్ని రకాలుగా నేరాలను నువ్వు చేయిస్తున్నావు.. నీ సభలకి రావాలంటే బెదిరించి తీసుకొస్తున్నావు.. చివరికి నీ పులివెందుల సంస్కృతిని మా పశ్చిమగోదావరి జిల్లాలోనూ వ్యాపించేలా చేశావు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయిస్తావా..?? మీ రౌడీ నాయకులను కూడా హెచ్చరిస్తున్నాను.. నీది కూడా ఒక మీడియా సంస్థ కదా.. నీ పెట్టుబడి కూడా మీడియా సంస్థల్లో ఉన్నవే గుర్తు పెట్టుకో.. ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ ప్రజల్ని నట్టేట ముంచేది నువ్వు కాదా..?? రాష్ట్ర ప్రజానీకం కోసం యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని, నువ్వు చేసేదంతా లూటీ కాదా..?? ఊసరవెల్లిలా మారి ప్రజా సంపదలను మింగేస్తున్నావు.. మాఫియా లాగా బండి పోటు దొంగలాగా రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకుంటూ, ప్రజా గొంతుకను నీకు పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడే అర్హత ఉందా..?? నీకు 175 కాదు కదా 15 సీట్లు వస్తే గొప్పే.. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేస్తుందనీ, నీకు గుండు కొట్టి నిన్ను ఇంటికి ఆ తర్వాత చంచల్గూడా జైలుకి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.. 50 నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టే నీవు అసలు నీ మీటింగ్ కి జనాలు వచ్చారా..?? పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా పిలిపిస్తే ఎక్కడ ఒక రూపాయి ఆశించకుండా జనాలు వస్తారు.. మందు బిర్యాని లేకుండా లక్షలాది మందే వచ్చే పరిస్థితి జనసేన పార్టీదని, ఒక ప్రజా నాయకుడిని పట్టుకొని నువ్వు బాక్సింగ్ పెట్టి నీ చెంచాల తోటి దానిమీద ఫైటింగ్ చేయించి బాక్సింగ్ చేయించి వాళ్లతోటి గుద్దించి ఆనందం పొందుతున్నావు.. అంత సరదాగా నీకు గనక ఉంటే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని పెట్టకుండా ఒంటరిగా జనాల్లోకి వచ్చి చూడు..మా జన సైనికులు వస్తారు.. నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా పర్దాలు లేకుండా బయటికి వచ్చే ధైర్యం నీకు ఉందా..?? నీవు డేరాలు తెరలు లేకుండా సమావేశాలు పెట్టు.. అప్పుడు నీకు తెలుస్తుందని నీకు నీ నోటి దూల నాయకులకు పాడి కట్టడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తున్నానని అన్నారు.. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, 2 టౌన్ మహిళ కార్యదర్శి తుమ్మపాల ఉమాదుర్గ, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బొద్దపు గోవిందు తదితరులు పాల్గొన్నారు.