మౌలిక సదుపాయాలు కరువై ఇక్కట్లు పడుతున్న నిరుపేదలు

  • గ్రామాలలో కరువైన స్వచ్ఛ సంకల్పం

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన మహాయజ్ఞం 651వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర ప్రతి ఇంటిని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీలో తిరుగుతున్న సమయంలో వారు చెప్తున్న కష్టాలు వింటుంటే కంటతడి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ఎస్టీ కాలనీలో ఎక్కువ శాతం గృహాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం వలన మహిళా తల్లులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో చాలా నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు సంభందించిన వారికి కనీస మౌలిక వసతులు అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, త్రాగు నీరు, రహదార్లు, విద్యుత్తు వంటి సదుపాయాలు లేకపోవడమే కాకుండా వారు నివసిస్తున్న తాటాకు ఇళ్ళకి కనీసం పాడైపోయిన ఆకులు మార్చుకునే స్థితిలో కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక సర్వే నిర్వహించి మౌలిక వసతులు లేని ప్రాంతాలను గుర్తించి వారికి వెంటనే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని తరుణంలో జనసేన పార్టీ నుండి తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, భాదితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.