జనంకోసం జనసేన – మహాపాదయాత్ర 87వ రోజు

  • ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన బలంగా నిలబడతాం
  • మాకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, కడుపుమంటతో మాపై తప్పుడు ఆరోపణలు
  • ‘కోటి’ గ్రామంలో పోటెత్తిన జనసైన్యం
  • రాజానగరం నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా గెలుపు జనసేన పార్టీదే
  • పవన్ కళ్యాణ్ ఆశయం కోసం అంకితభావంతో సమిష్టిగా పనిచేద్దాం
  • పాలన చేతకాకే వైసిపి వారు రాక్షస చేష్టలకు దిగుతున్నారు
  • ఈ నెల 14న మచిలీపట్నంలో జరిగే 10 వ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం
  • మాకు అండగా నిలబడిన రాజానగరం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడడం మా కర్తవ్యం
  • “మహాపాదయాత్ర”కు బ్రహ్మరథం పట్టిన కోటి గ్రామ ప్రజలు
  • కోటి గ్రామ వీధుల్లో అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ, పెద్దఎత్తున బాణసంచా పేల్చుతూ, తీన్మార్ డబ్బులతో, పెద్దఎత్తున మహిళలు హారతులు పడుతూ “బత్తుల” దంపతులకు ఘనస్వాగతం పలికిన కోటి గ్రామం

రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” ‘ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం’ కోరుకొండ మండలం, కోటి గ్రామంలో జనహృదయనేత బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మిల దంపతుల ఆధ్వర్యంలో, జనశ్రేణుల నేతృత్వంలో, గ్రామప్రజల ఆదరాభిమానాలతో పాదయాత్ర అత్యంత అద్భుతంగా జరిగింది. ముందుగా జననాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులకు జనసేనశ్రేణుల నుండి అపూర్వ స్వాగతం లభించింది, వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి గ్రామంలో రాత్రి 10 గంటల వరకు ఉధృతంగా ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమం ప్రజల నుండి అనూహ్యస్పందన లభించింది. ఈ సందర్భంగా బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ “మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎవరెన్ని కుట్రలు పన్నినా, ప్రజలకు పక్షాన బలంగా నిలబడతామని,తమ పై ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలకు తమ చివర శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటామని, ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు కోసం మరింత కష్టపడతామని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీదే గెలుపుని, విజయం కోసం జనసేనశ్రేణులు అంకితభావంతో, చిత్తశుద్ధితో సమిష్టిగా పనిచేయాలని, పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యాలు నెరవేర్చడం కోసం జనసైనికులు మరింత కష్టపడాలని, జనసేన పార్టీ విధివిధానాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత జనసైనికులదేనని, అలానే పాలన చేతకాకే రాక్షస చర్యలతో వైసిపి ఆగడాలు శృతిమించుతున్నాయని, రోజు రోజుకి దిగజారి పోతున్న ఈ వైసిపి ప్రభుత్వం తీరుకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు జనసేన పార్టీకి పట్టం కట్టి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో జనసేన పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని” అన్నారు. కోటి గ్రామంలో సుదీర్ఘంగా కొనసాగిన ఈ మహాపాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కోటి గ్రామ జనసేన యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.