గంగానమ్మ గుడి ప్రహరీ గోడను పరిశీలించిన జనసేన నాయకులు

  • గంగానమ్మ దేవాలయం యొక్క ప్రహరీ గోడను అక్రమంగా కూల్చి వేయడం అన్యాయం
  • జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న తాడేపల్లి బోసు బొమ్మ సెంటర్ వద్ద గల గంగానమ్మ దేవాలయం ప్రహరీ గోడను అక్రమంగా కూల్చే వేయడంతో ఘ్టనా స్థలిని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఎంటిఎంసీ పరిధిలోని తాడేపల్లి బోసు బొమ్మ సెంటర్ వద్ద గల గంగానమ్మ దేవాలయం యొక్క ప్రహరీ గోడను అక్రమంగా కూల్చే వేయడం అన్యాయమని, కూల్చిన ప్రహరీ గోడ స్థానంలో వెంటనే మరో గోడ నిర్మించాలని, అక్రమంగా కూల్చి వేయించిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 2019లో ఒకసారి ఇలాగే కూల్చి వేస్తే తాడేపల్లి పురపాల సంఘం వారు స్థానికుల ఫిర్యాదు మేరకు గోడను నిర్మించారు. ఇప్పుడు అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వైసిపి నాయకుల అండ చూసుకొని మళ్లీ తన ఇంటి దారి కోసం అక్రమంగా గోడను కూల్చి వేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా దీని పై స్పందించట్లేదని స్థానికులు తెలియజేశారు అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గంగానమ్మ గుడి పరిరక్షణ కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంటిఎంసీ కార్యదర్శి బళ్ళ ఉమామహేశ్వరరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు తంబి, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, ఉండవల్లి గ్రామాధ్యక్షులు రాజా రమేష్, ఉండవల్లి గ్రామ కమిటీ సభ్యులు బాబా శంకర్, మున్నా, నాగేంద్రబాబు, స్థానిక గ్రామస్తులు సుబ్రహ్మణ్యం, అనిల్, నరేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.