బన్నీస్నేహ ని ఫస్ట్ టైం ఎక్కడ చూశాడో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. తాజాగా తన ప్రేమ ఎప్పుడు ఎలా పుట్టిందో..స్నేహ ను ఎక్కడ చూశాడో తెలిపి ఆశ్చర్య పరిచారు.

సామ్ హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ ప్రోగ్రాంలో స్నేహారెడ్డితో అల్లు అర్జున్ తొలిపరిచయం, ప్రేమ పెళ్లి సంగతులను తెలిపారు. మీ భార్య అల్లు స్నేహారెడ్డిలో మీకు నచ్చింది ఏంటి? అని సమంత వేసిన ప్రశ్నపై అల్లు అర్జున్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఆమెలో ఉన్న డిగ్నిటీ తనకు బాగా నచ్చిందంటూ ఓ సందర్భాన్ని వివరించారు. తాను ఫస్ట్ టైం స్నేహను ఓ నైట్ క్లబ్ పార్టీలో చూశానని, అంత మందిలో కూడా ఆమె చాలా డిగ్నిటీగా కనిపించిందని అన్నారు. ఆ సందర్భంలో సమయం రాత్రి రెండు గంటలవుతున్నా కూడా చాలా పద్దతిగా కనిపించడం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఆలా ఫస్ట్ టైం చూసి ప్రేమలో పడినట్లు తెలిపాడు.