మహల్ సాక్షిగా తాజ్ దశ వివాహ వార్షికోత్సవం..

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జంట ఒకటి. మార్చి 6,2011న వీరి వివాహం జరగగా శనివారంతో వీరి వివాహ బంధానికి పది సంవత్సరాలు. ఈ పదేళ్ళ దాంపత్యంలో వారికి ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. బన్నీ దంపతులు అయాన్, అర్హ అనే ఇద్దరు చిన్నారులకు జన్మనివ్వగా, వారు నెటిజన్స్‌కు చాలా సుపరిచితం. క్యూట్ క్యూట్‌గా ఉండే ఈ చిన్నారులని చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు.

పెళ్లి జరిగి పదేళ్ళు కావడంతో అల్లుఅర్జున్ తన భార్య స్నేహతో కలిసి ప్రేమసౌధం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..ఈ పదేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయని, ఇంకెన్నో యానివర్సిరీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. తాజ్ మహల్ దగ్గర బన్నీ, స్నేహా రెడ్డి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉండగా ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది.