రాజకీయ విప్లవం వారాహి యాత్రను విజయవంతం చేయండి

  • వింజమూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్

ఉదయగిరి: రాజకీయ విప్లవం వారాహి యాత్రను విజయవంతం చేయండి.. ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు అవ్వండి..అంటూ జూన్ 14వ తేదీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి ప్రారంభం అవుతున్న పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం నిర్విఘ్నంగా సాగాలని వింజమూరు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్ కోరారు. ఈ సందర్భంగా సుభాని భాయ్ మాట్లాడుతూ.. చారిత్రాత్మక ఘట్టంలో అందరూ భాగస్వాములు అవ్వాలని జవాబుదారీతనం కోరుతూ సాగుతున్న జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. రాజకీయాల్లో కొత్త ఒరవడి సామాన్యుడి సమస్యకు అండగా నిలబడి వారికి సహాయం చేసి ప్రశ్నించగల గొంతుకను గెలిపించాల్సిందిగా కోరారు.. రాజకీయాలను పెట్టుకొని ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విడదీసి దోచుకు తింటున్న రాజకీయ నాయకులకు సరైన సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తిగానే ఎంతో మందికి ఆపన్న హస్తము అందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అనిస్చితితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి రంగంలో నడిపించాలి. ప్రజా శ్రేయస్సు కోసం పదేళ్లుగా ఆటుపోటులను ఎదుర్కొని నిలబడిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా జనసేన నాయకులు వీర మహిళలు జనసేన మద్దతు దారులు మెగా అభిమానులు తరలిరావాలి. 14వ తేదీ నుండి జరుగుతున్న వారాహి ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని ప్రజా సమస్యలు తీర్చేందుకు వస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించండని సుభాని పిలుపు నిచ్చారు.